నందమూరి బాలకృష్ణ రూటే సెపరేటు. ఫ్లాప్ దర్శకులకు అవకాశాలు అవ్వడంలో ఆయన ముందుంటాడు. ఒక్కోసారి అవి మంచి ఫలితాల్ని ఇచ్చాయి. కాకపోతే.. చాలాసార్లు నెగిటీవ్ రిజల్ట్ ని తెచ్చిపెట్టాయి. కానీ బాలయ్య మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు మరోసారి ఓ ఫ్లాప్, వెటరన్ దర్శకుడికి ఛాన్సిచ్చి... అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు.
బి.గోపాల్ బాలయ్య కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడని, వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. బి.గోపాల్ మెగా ఫోన్ పట్టి చాలా కాలం అయ్యింది. ఆయన తీసిన ఆఖరి సినిమా `ఆరడుగుల బుల్లెట్` విడుదలకు కూడా నోచుకోలేదు. ఈ దశలో బాలయ్య.. గోపాల్ తో సినిమా తీయడం రిస్కని అభిమానులు భావించారు. బాలయ్య కూడా అంత సాహసం చేయడని అనుకున్నారు. కానీ.. అనుకున్నదంతా అవుతోంది. బి.గోపాల్ ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేసేశాడని టాక్. ఇటీవల బాలయ్యతో కలిసి కథ కూడా చెప్పారని తెలుస్తోంది. ఈ కథకు బాలయ్య పచ్చజెండా ఊపడమూ జరిగిపోయాయని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య మరో రిస్కు తీసుకుంటున్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?