నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. సింహా, లెజెండ్ వీళ్ల కాంబోలోనే వచ్చాయి. రెండూ సూపర్ హిట్లే. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా పట్టాలెక్కిందో, అప్పటి నుంచే భారీ అంచనాలు మొదలెపోయాయి. ఇందులో బాలయ్య అఘోరాగా కనిపిస్తున్నాడన్న సంగతి తెలిసి - మరింత ఫోకస్ పెంచేశారు.
బాలయ్య అఘోరాగా ఎలా కనిపిస్తాడు? ఆ గెటప్ ఎంత సేపు? అంటూ చర్చ మొదలెట్టారు. ఈ సినిమాకి కచ్చితంగా అదో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావించారు. అయితే ఇప్పుడు బాలయ్య కీలకమైన నిర్ణయం తీసుకున్నాడట. ఆఘోరా సన్నివేశాలన్నీ పక్కన పెట్టాడట. ఆ పాత్రని పూర్తిగా మార్చేయాలని దర్శకుడికి సూచించాడట. దాంతో బోయపాటి షాక్ తిన్నాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.
అఘోరా గెటప్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని ఇది వరకే చిత్రీకరించారు కూడా. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి.. సినిమా రీషూట్ చేయబోతున్నార్ట. అఘోరా పాత్ర స్థానంలో కొత్త తరహా పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఓ అగ్ర కథానాయకుడు ఇప్పటి వరకూ అఘోరా గెటప్ లో కనిపించలేదు. అదే ఈసినిమాకి ప్లస్ పాయింట్ అనుకున్నారు. అయితే తనని అభిమానులు అఘోరా గెటప్ లో చూడగలరా? లేదా? అనే అనుమానం బాలయ్యకు వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.