చిరంజీవి `ఆచార్య` మేలో విడుదల కానుంది. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ నాటికి... పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ అయిపోతాయి. అందుకే ఏప్రిల్ లోనే కొత్త సినిమా మొదలెట్టాలని చిరంజీవి భావిస్తున్నాడు. ఆయన మలయాళ `లూసీఫర్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. ప్రస్తుతం చెన్నైలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు స్క్రిప్టు పనులన్నీ పూర్తవుతాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలు పెడతారు.
మరోవైపు `వేదాళం` రీమేక్ కీ చిరు సై అన్న సంగతి తెలిసిందే. మెహర్‌రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. మెహర్ ఎప్పుడో `వేదాళం` స్క్రిప్టు పూర్తి చేసేశాడు. చిరంజీవికి ఫస్ట్ ఆఫ్ కూడా వినిపించేశాడు. సెకండ్ హాఫ్ వినిపించి, చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలన్నది మెహర్ రమేష్ తాపత్రయం. ఈ యేడాది చివర్లో `వేదాళం` సెట్స్‌పైకి వెళ్లనుంది. దర్శకుడు బాబి, గోపీచంద్ మలినేనిలు కూడా చిరు కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. అవన్నీ ఎప్పుడు ఓ కొలిక్కి వస్తాయో..?