బాలకృష్ణ సినిమా అంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు తప్పనిసరి. రెండు రకాల షేడ్స్, లేదంటే డ్యూయల్ రోల్ కథలున్న పాత్రల్ని బాలయ్య ఇష్టపడుతుంటాడు. అందుకే హీరోయిన్లు కూడా ఎక్కువ మంది కనిపిస్తుంటారు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ రెండు సినిమాలు వచ్చాయి. రెండింటిలోనూ ఇద్దరేసి నాయికలున్నారు. ఐటెమ్ గీతాలూ కనిపించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్టయ్యింది. దానికి తోడు బాలయ్య పాత్రలో రెండు షేడ్స్ కనిపించనున్నాయి. దాంతో ఈసారీ ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ఫిక్సయిపోయారు జనాలు. కాకపోతే ఈసారి బాలయ్య ఒక్క హీరోయిన్ తోనే సరిపెట్టుకుంటున్నాడట.
ఈ సినిమాలో ఒకే ఒక్క కథానాయిక ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. అందునా ఓ కొత్త కథానాయికని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నార్ట. ఇప్పటి వరకూ కథానాయికపై వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే అని, ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని బోయపాటి క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్టు అక్టోబరులో ఈ సినిమాని సిద్ధం చేయాలనుకుంటున్నామని, షూటింగులు ఆలస్యమైనా ఆ సమయానికి రాగలమన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు బోయపాటి. చూద్దాం.. మరి ఏమవుతుందో?