తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రామచంద్రన్ 'అజ్ఞాతవాసి' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. అయితే, తొలి సినిమాతో అనిరుధ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్‌గా చేసిన 'గాలి వాలుగా..' వీడియో సాంగ్ అనిరుధ్‌ని సులువుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి మ్యూజిక్ అందించాడు అనిరుధ్. ఈ సినిమాలో 'గ్యాంగూ..గ్యాంగూ.. గ్యాంగూలీడరూ..' అని సాగే టైటిల్ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో నానితో కలసి మాస్ స్టెప్పులు ఇరగదీసి బాగా రిజిస్టర్ అయిపోయాడు.
బ్యాక్ టూ బ్యాక్ నానితో రెండు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అనిరుధ్. నాని తాజా చిత్రం 'వి'కి కూడా అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే, బాలయ్య - బోయపాటి కాంబో మూవీకి అనిరుధ్‌ని పరిశీలిస్తున్నారట. ఆ దిశగా అనిరుధ్‌తో చర్చలు నడుస్తున్నాయట. బాలయ్య కోసం ఆల్రెడీ కొన్ని ట్యూన్లు కూడా సిద్ధం చేశాడట అనిరుధ్. ఆ ట్యూన్స్ పట్ల బాలయ్య సుముఖంగా ఉండడంతో, అనిరుధ్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం కొన్ని రోజులు ఆగాల్సి ఉంది. డిశంబర్‌లో బాలయ్య 'రూలర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకి దర్శకుడు. సి.కళ్యాణ్‌తో కలిసి బాలయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.