సెంటిమెంట్‌ 'కలర్స్‌' అద్దుతున్నాడు!

By Inkmantra - December 27, 2019 - 16:10 PM IST

మరిన్ని వార్తలు

సీక్వెల్స్‌ తెరకెక్కించేటప్పుడు సెంటిమెంట్స్‌ ఉండడం చాలా సహజం. హీరోయిన్‌, బ్యానర్‌ ఇతరత్రా టెక్నీషియన్స్‌.. ఇలా కొన్ని సెంటిమెంట్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అలా ఓ సీక్వెల్‌ గురించి మాట్లాడుకుంటూ, సెంటిమెంట్‌ని గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఏంటా సీక్వెల్‌? ఏంటా కథా? అంటే, యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ద్‌కి కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ ఇచ్చిన సినిమా 'కార్తికేయ'. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌ రూపొందించాలనుకుంటున్నారు. చాలా కాలంగా ఈ సినిమాకి సీక్వెల్‌ తీయాలనుకున్నా, కుదరలేదు. ఇన్నాళ్లకి ముహూర్తం కుదిరేలా ఉంది. త్వరలోనే సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లాలనుకుంటున్నారట.

 

అయితే, సెంటిమెంట్‌ ప్రకారం ఈ సినిమాలో కలర్స్‌ స్వాతి నటించాలని నిఖిల్‌ కోరుతున్నాడట. డైరెక్టర్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కలర్స్‌ స్వాతి పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరమైంది. అయితే, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మంచి కథ దొరికితే, మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానంటూ స్వాతి చిన్న హింట్‌ ఇచ్చింది. ఆ హింట్‌లో భాగంగా, కలర్స్‌ స్వాతి రీ ఎంట్రీ మూవీ 'కార్తికేయ 2' అవుతుందా.? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS