అన్ లాక్ లో భాగంగా... షూటింగులు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో అనుమతులు ఇచ్చేశాయి.కాకపోతే.. బడా స్టార్లే ఎవరూ బయటకు రావడం లేదు. చిన్నా చితకా సినిమాలు తప్ప, పెద్ద సినిమాలేవీ చిత్రీకరణలు మొదలు పెట్టలేదు. అయితే ఇప్పుడు తొలి అడుగు పడబోతోంది. నందమూరి బాలకృష్ణ షూటింగులకు సై అన్నారు. త్వరలోనే బాలయ్య సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనాకు ముందు కొన్ని రోజులు షూటింగ్ చేశారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిన్న టీజర్‌ని విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే నెలలో బాలకృష్ణ సెట్స్‌లోకి అడుగుపెడతారని టాక్. దాంతో.. బోయపాటి సినిమా మళ్లీ శ్రీకారం చుట్టుకోనుంది. ఈసారి.. నిరవధికంగా షూటింగ్ నిర్వహిస్తారని టాక్. ఈ సినిమా కోసం చాలా టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. రోజు కో కొత్త టైటిల్ పుట్టుకొస్తోంది. వాటన్నింటికీ చెక్ పెడుతూ - టైటిల్ ని ప్రకటించాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరతోనే ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రటించే అవకాశాలున్నాయి.