ఈ యేడాది జనవరిలో రియా - సుశాంత్ మధ్య జరిగిన సంభాషణల్ని బయటకు తీసింది సీబీఐ. వాటిని బట్టి చూస్తే సుశాంత్ కి ఆర్థిక సమస్యలు ఉన్నాయన్న విషయం అర్థం అవుతోంది. సుశాంత్ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యాయని, డబ్బుల కోసం సుశాంత్ తన కార్లని అమ్మాలని నిర్ణయించుకున్నాడని ఆ టేపుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు.. కొన్నాళ్లు ముంబై ని విడిచి దూరంగా వెళ్లాలనుకున్నాడు సుశాంత్. అందుకోసం గోవాని ఎంచుకున్నాడు. గోవాలో కొంతకాలం ఉండి, ఆ తరవాత మళ్లీ ముంబై వద్దామని భావించాడట. నటుడిగా సుశాంత్ ఎప్పుడూ బిజీనే. `ధోనీ` సినిమాతో ఇంకా పాపులర్ అయ్యాడు. అలాంటి సుశాంత్‌కి ఆర్థిక సమస్యలు ఎందుకొచ్చాయి? ఎలా వచ్చాయి? అనే కోణంలో సీబీఐ మరింత లోతుగా విచారణ చేస్తోంది.
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఎన్ని మలుపులో. ఆ ఆత్మహత్య వెనుక ఇంకెన్ని కొత్త కారణాలో. డిప్రెషన్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాధమిక విచారణలో తేలింది. ఆ డిప్రెషన్ ఎవరి వల్ల, ఎందువల్ల వచ్చింది? అనే విషయాలపై సీబీఐ ఇప్పుడు లోతుగా విచారణ చేస్తోంది. అందులో భాగంగా కొన్ని ఆడియో టేపులు సేకరించింది సీబీఐ. అందులో రియా - సుశాంత్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి.