బాల‌య్య‌... బ్యాక్ టూ బోయ‌పాటి..?

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్ పూర్త‌యిన వెంట‌నే బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. అయితే క‌థ రెడీ చేయ‌డంలో బోయ‌పాటి కాస్త టైమ్ తీసుకోవ‌డంతో... కె.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రిని అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దించాడు బాల‌కృష్ణ‌. దాంతో బోయ‌పాటి సినిమా సెప్టెంబ‌రుకి వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు క‌థ అడ్డం తిరిగింది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమా కూడా ఆగిపోయింది. దాంతో బాల‌య్య ఇప్పుడు బోయ‌పాటిపై దృష్టి పెట్టాడ‌ని టాక్‌.

 

సాధార‌ణంగా క‌థ‌ని సిద్ధం చేసుకోవ‌డానికి బోయ‌పాటి చాలా స‌మ‌యం తీసుకుంటాడు. పైగా బాల‌కృష్ణ‌తో సినిమా అంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. పైగా.. బోయ‌పాటి రాసుకున్న క‌థ ప్ర‌కారం.. బాల‌య్య బ‌రువు త‌గ్గాలి. క‌నీసం 20 కిలోలు త‌గ్గాల్సివుంది. ఇప్ప‌టికిప్పుడు బ‌రువు త‌గ్గ‌డం సాధ్యం కాదు కాబ‌ట్టి - బాల‌య్య టైమ్ తీసుకోవాల‌నుకున్నాడు. ఈలోగా ఖాళీగా ఉండ‌డం ఎందుక‌ని.... కె.ఎస్‌. ర‌వికుమార్ సినిమాని పూర్తి చేద్దామ‌ని భావించాడు.

 

కానీ అనుకున్న‌వ‌న్నీ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వు క‌దా? అందుకే ఇప్పుడు బాల‌కృష్ణ దృష్టి బోయ‌పాటి వైపుకు మ‌ళ్లింది. ఈ విష‌య‌మై బాల‌య్య‌తో బోయ‌పాటి భేటీ అయ్యార్ట‌. బోయ‌పాటి క‌థ సిద్ధం చేశాడా? బాల‌య్య బ‌రువు త‌గ్గ‌డానికి ఎంత స‌మ‌యం తీసుకుంటాడు? అనే విష‌యాల్ని బ‌ట్టి ఈ సినిమాకి క్లాప్ ఎప్పుడు కొడ‌తార‌న్న‌ది తెలుస్తుంది. లేదంటే సినిమా మొద‌లెట్టి, ముందుగా బాల‌య్య లేని స‌న్నివేశాల్ని తీసుకుంటూ వెళ్తే మంచిద‌న్న ఆలోచ‌న కూడా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS