'7జీ బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే' వంటి విభిన్న కథలను తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవ. సినిమా సినిమాకీ అస్సలు పొంతన లేని కథల్ని ఎంచుకోవడం ఆయన స్పెషాలిటీ. ఈ సారి 'ఎన్‌జీకే' సినిమాని తెరకెక్కించారు. ఓ సాధారణ వ్యక్తిని కొన్ని శక్తులు బలవంతంగా రాజకీయాల్లోకి లాగడంతో ఆ వ్యక్తి ఎలా వాటిని ఎదురొడ్డి విజయం సాధించాడు.? అనేదే ఈ సినిమా కథ. సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ పోలిటిక్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఎలక్షన్స్‌లో పవన్ అనుకున్నది సాధించలేకపోయాడు. మార్పును ప్రజలు ఆహ్వానించలేకపోయారు. ఇదంతా జనసేన పార్టీ ఉదంతం. జనసేనాని సిద్ధాంతం. అయితే, 'ఎన్‌జీకే' స్టోరీ కొద్దిగా పవన్ లైఫ్ స్టైల్‌కి దగ్గరగా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీకి కూడా కొన్ని శక్తులు ప్రేరేపించాయా.? అంటే పూర్తిగా కొట్టి పడేయడానికి లేదు.
కానీ, ఈ సినిమాకీ, పవన్ కళ్యాణ్ రాజకీయానికి ఏ మాత్రం పొంతన లేదన్నది కొందరి వాదన. ఏది ఏమైనా సూర్య నటిస్తున్న 'ఎన్‌జీకే' సినిమాపై జనాల్లో ఆశక్తి ఎక్కువగానే నెలకొంది. డైరెక్టర్ వైపు నుండీ, హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ వైపు నుండి కూడా ఈ సినిమాకి పోజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చూడాలి మరి, 'ఎన్‌జీకే' ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.