బోయ‌పాటి త‌గ్గ‌డు... బాల‌య్య విన‌డు

మరిన్ని వార్తలు

బాల‌కృష్ణ - బోయ‌పాటి.. ఇద్ద‌రూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు ప‌ల్టీలు కొట్టి, రూల‌ర్ కూడా ఫ్లాఫ్ అయ్యాక‌.. బాల‌య్య ఫ్యాన్స్ మ‌రీ నీర‌స ప‌డిపోయారు. విన‌య విధేయ రామా - ఫ్లాపుతో బోయ‌పాటికీ చుక్క‌లు క‌నిపించాయి. ఇప్పుడు వీరిద్ద‌రూ సినిమా చేస్తున్నారు. దానిపై గ‌త ఫ్లాపుల ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండాల‌ని అటు బాల‌య్య‌, ఇటు బోయ‌పాటి ఇద్ద‌రూ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సినిమాకి ఏకంగా 70 కోట్ల బ‌డ్జెట్ కేటాయించ‌డం చూస్తుంటే.. ఈ కాంబినేష‌న్‌పై వారిద్ద‌రికీ ఎలాంటి న‌మ్మ‌కం ఉందో అర్థ‌మౌతోంది.

 

బాల‌య్య బోయ‌పాటి... ఇద్ద‌రి నుంచి గ‌తంలో సింహా, లెజెండ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. ఒక‌రిపై మ‌రొక‌రికి అపార‌మైన న‌మ్మ‌కం. ఇద్ద‌రి ట్యూనింగ్ భ‌లే బాగుంటుంది. అయితే ఈసారి మాత్రం ట్యూనింగు స‌రిగా కుద‌ర‌డం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌తీ సినిమాకీ బాల‌కృష్ణ‌కంటూ సెప‌రేటు టీమ్ ఉంటుంది. మేక‌ప్ మెన్‌, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, హెయిర్ స్టైలీష్‌... ఇలా బాల‌య్య కోసం క‌నీసం ఐదారుమంది ప‌నిచేస్తారు. దానికి తోడు బాల‌య్య సినిమాలో క‌చ్చితంగా క‌నిపించాల్సిన న‌టీన‌టులు కొంత‌మంది ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌.. చల‌ప‌తిరావు బాబాయ్‌లాంటోళ్లు.

 

అయితే ఇలాంటి టీమ్‌ని బోయ‌పాటి పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ని టాక్‌. త‌న‌కు అనువైన వాళ్ల‌ని ఈ టీమ్‌లో చేర్చుకుంటున్నాడ‌ట‌. ఈ విష‌యంలో బాల‌య్య బోయ‌పాటిపై గుర్రుగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ''నా మ‌నుషులు నా సినిమాలో ఉండాల్సిందే'' అని బాల‌య్య ''కొత్త టీమ్ రావాల్సిందే.. లేదంటే... ఫ్లాపులు కూడా కంటిన్యూ అవుతాయి'' అని బోయ‌పాటి... ఇద్ద‌రూ ఎవ‌రి ప‌ట్టుద‌ల వాళ్లు ప్ర‌ద‌ర్శిస్తున్నార్ట‌. మ‌ధ్య‌లో నిర్మాత నలిగిపోతున్నాడ‌ని తెలుస్తోంది. హీరో, ద‌ర్శ‌కుడి మ‌ధ్య చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో న‌డ‌వాల్సిన సినిమా ఇలా మొద‌ట్లోనే ఎగుడు దిగుడుల ప్ర‌యాణంలా సాగితే ఎలా? అని చిత్ర‌బృందం టెన్ష‌న్ ప‌డుతోంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS