బాల‌య్య - బోయ‌పాటి.. ముహూర్తం ఫిక్స్‌

By iQlikMovies - September 15, 2019 - 15:19 PM IST

మరిన్ని వార్తలు

సింహా, లెజెండ్ త‌ర‌వాత బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ కి సిద్ధ‌మ‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఓ సినిమా రాబోతోంద‌ని ఎప్పుడో చెప్పారు. కానీ.. ఇప్పటి వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ కంటే ముందు బోయ‌పాటి బాల‌య్య‌కు క‌థ వినిపించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఈ సినిమా విడుద‌ల కావాల్సింది.

అయితే మ‌ధ్య‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్ ఒప్పుకోవ‌డం వ‌ల్ల బోయ‌పాటి బాల‌య్య కోసం ఎదురుచూడాల్సివ‌చ్చింది. ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరింది. డిసెంబ‌రు నుంచి బాల‌య్య సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తామ‌ని బోయ‌పాటి ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. 2020 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

సింహా, లెజెండ్‌ల‌లో బాల‌య్య పాత్ర‌ని శ‌క్తిమంతంగా తీర్చిదిద్దాడు బోయ‌పాటి. వాటిలో బాల‌య్య పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. ఈసారీ అలానే ఉండ‌బోతోంద‌ని, స‌మాజంలో జ‌రుగుతున్న ఓ స‌మ‌స్య‌ని ప్ర‌ధాన వ‌స్తువుగా ఎంచుకుని క‌థ రాశార‌ని నిర్మాత ర‌వీంద‌ర్‌రెడ్డి తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS