నందమూరి బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ తీవ్ర నిరాశకు గురిచేసింది. బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతటి చేదు అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాలయ్య తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. బోయపాటితో బాలయ్య చేయబోయే సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చేసారు.
బోయపాటి - బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న ఈ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేసేసారు. ఈ నెల 28న లాంఛనంగా ఈ సినిమాని ప్రారంభించబోతున్నారట. బోయపాటి - బాలయ్య కాంబినేషన్ అంటే ఇండస్ట్రీలో హిట్ టాక్ ఉంది. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణకి 'సింహా' చిత్రం ద్వారా సూపర్ హిట్ అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకుమించిన విజయాన్ని సాధించింది.
'వినయ విధేయ రామ' రిజల్ట్ తో బోయపాటి కెరీర్ కూడా అధమ స్థాయికి పడిపోయింది. కాబట్టి సింహా, లెజెండ్ తరహాలో ఓ హిట్ సినిమా వస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి కోలుకోవటం కష్టమే. అందుకోసమే, బాలకృష్ణ సినిమా విషయంలో బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే, ఈ చిత్రాన్ని బాలయ్యే నిర్మిస్తున్నాడా? లేక నిర్మాణ బాధ్యతల్ని వేరెవరికైనా అప్పగించారా? అన్నది తెలియాల్సి ఉంది.