గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలు పోలీసాఫీసర్ గెటప్స్‌లో కనిపించి కనువిందు చేశారు. అయితే లేడీ పోలీసాఫీసర్ గెటప్‌లో సీరియస్‌గా నటించి మెప్పించింది మాత్రం లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి మాత్రమే. ఇప్పుడయితే కెరీర్‌లో పెద్దగా అనుభవం లేని ముద్దుగుమ్మలు కూడా పోలీస్ గెటప్స్ వేసేస్తున్నారు. అది కూడా సీరియస్ పోలీసాఫీసర్స్‌గా నటించేందుకు సిద్ధపడుతున్నారు.
సౌత్ క్వీన్ నయనతార ఇటీవల 'సీబీఐ ఆఫీసర్ అంజలి'గా వచ్చి మెప్పించింది. 'క్షణం' సినిమాలో అనసూయ కూడా సీరియస్ పోలీసాఫీసర్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అదే టైంలో బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్‌ని 'కేశవ' సినిమా కోసం పోలీస్ ఆఫీసర్‌గా తీసుకొచ్చారు. ఇక మరో ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ కూడా త్వరలో 'ఝాన్సీ' సినిమాతో పోలీసాఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ 'డానీ' కోసం సీరియస్ పోలీసాఫీసర్ గెటప్‌లో దర్శనమివ్వనుంది.
వీరందిరితో పాటు, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ నందితా శ్వేత కూడా ఖాకీ డ్రస్సుపై మోజు పడింది. నందితా శ్వేత ప్రధాన పాత్రలో 'ఐపీసీ 376' సినిమా రూపొందనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రామ్‌కుమార్ సుబ్బరామన్ దర్శకుడు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన 'ఐపీసీ 376' పోస్టర్ ఆకట్టుకుంటోంది. మరోవైపు నందితా శ్వేత త్వరలో 'ప్రేమకథా చిత్రమ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.