టాప్ హీరో.. సినిమా అంటే స్టార్ హీరోయిన్ ని వెదికి పట్టుకోవాల్సిందే. అప్పుడే ఆ కాంబినేషన్‌కి క్రేజ్, సినిమాపై ఓ అంచనా మొదలవుతుంది. అయితే... నందమూరి బాలకృష్ణ సినిమాలో మాత్రం స్టార్ హీరోయిన్ల దర్శనం లేదు. ఇందులో ఇద్దరు కథానాయికలుంటే, ఓ కథానాయికగా కొత్తమ్మాయిని తీసుకొచ్చారు. మరో కథానాయిక పాత్ర వెటరన్ హీరోయిన్ అప్పటించారు. ఈ సినిమాలో ప్రయాగా మార్టిన్, పూర్ణలను కథానాయికలుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.
బాలయ్య - బోయపాటి సినిమాలో స్టార్ హీరోయిన్లు లేకపోవడం కాస్త లోటే. బాలయ్య సినిమాలో నటించడానికి స్టార్ హీరోయిన్లు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని, అందుకే కొత్త వాళ్లని ఎంచుకోవాల్సివచ్చిందని గుసగుసలు వినిపించాయి. అయితే అసలు కారణం వేరు. స్టార్ హీరోయిన్లను పెట్టుకొనేంత బడ్జెట్ ఈసినిమాకి లేదని, బడ్జెట్ పరిమితుల వల్లే... కొత్త వాళ్లకు తీసుకోవాల్సివచ్చిందని టాక్. ఈ సినిమా కోసం ఇద్దరుస్టార్ హీరోయిన్లని తీసుకోవాలంటే కనీసం 3 కోట్లయినా వెచ్చించాలి.
వీరిద్దరి మాత్రం 30 లక్షల్లో సెటిల్ చేసేశార్ట. అదీ.. ఈ స్టార్ హీరోయిన్లని పక్కన పెట్టి, వీళ్లని ఎంచుకోవడంలో ఉన్న మతలబు. సినిమాకి గ్లామర్ ఎంతో ముఖ్యం. బడ్జెట్ తగ్గించడానికి గ్లామర్ లేకుండా చేసేశారిప్పుడు. మరి ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే.. బాలయ్యసినిమా బయటకు కావాల్సిందే.