మిల్కీ బ్యూటీ ప్రొడక్షన్‌ హౌస్‌

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో చాలా బిజీగా వుంది. గోపీచంద్‌ సరసన ఆమె చేస్తోన్న ‘సీటీమార్‌’ ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమట. కబడ్డీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాని దర్శకుడు సంపత్‌ నంది తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో సినిమా ఆలస్యమయ్యిందిగానీ, లేకపోతే ఈ పాటికి సినిమా పూర్తయిపోయేదే. ఇదిలా వుంటే, మరో అరడజను సినిమాల్లో నటిస్తోన్న తమన్నా, త్వరలోనే ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ని సొంతంగా లాంఛ్‌ చేయబోతోందన్నది ప్రస్తుతం సినీ వర్గాల్లో విన్పిస్తోన్న హాట్‌ టాపిక్‌.

 

నటీనటులు సొంత బ్యానర్స్‌ని స్థాపించడం ఇటీవల విరివిగానే జరుగుతోంది. సొంత నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తే ఆ కిక్‌ ఓ రేంజ్‌లో వుంటుంది మరి.! హీరోయిన్‌గా కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకుని, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాపులారిటీ పెంచుకున్న తమన్నా, సినీ పరిశ్రమకు తనవంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశ్యంతోనే సొంత బ్యానర్‌ని స్థాపించబోతోందట. ముందుగా ఓ వెబ్‌సిరీస్‌ని తమన్నా నిర్మించబోతోందనీ, ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఓ సినిమాని తెరకెక్కించబోతోందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై తమన్నా అధికారిక ప్రకటన చేయాల్సి వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS