నందమూరి బాలకృష్ణ అనారోగ్యం పై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. బాలకృష్ణ మోకాలికి ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారని రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. అయితే.. బాలయ్యకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళారని,. అప్పటి ఫొటోలతో కొమ్ద్దరు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు.
దయచేసి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దని, బాలయ్య విశ్రాంతిలో లేరని, ఈరోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో షూటింగ్ లోనూ పాలుపంచుకుంటున్నారని బాలయ్య పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ రోజు ఆ షూటింగ్‌లోనే బాలయ్య పాల్గొంటారు. అఖండతో మాస్ హిట్ అందుకున్న బాలయ్య అదే జోష్ లో పక్కా కమర్షియల్ మాస్ ఇంటర్ ట్రైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.