పేరుకి పెద్ద స్టార్ అయినా.. దర్శకుడు ఎలా చెబితే అలా మౌల్డ్ అవ్వడానికి సదా సిద్దంగా ఉంటారని నందమూరి బాలకృష్ణ గురించి చెప్తుంటారంతా. సెట్లో ఆయన క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ... ఇవన్నీ మొదటి సారి గమనిస్తున్న పూరి జగన్నాథ్ మాత్రం బాలయ్య క్రమశిక్షణ, సమయపాలన చూసి ముగ్థుడవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెట్లో బాలయ్యని చూసి.. మురిసిపోతున్నాడు పూరి. ఉదయం 7 గంటలకు ఫస్ట్ షాట్ అంటే.. ఆరున్నరకే విత్ మేకప్‌తో రెడీగా ఉంటున్నాడట బాలయ్య. అర్థరాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వెళ్లినా.. మరుసటి రోజు క్రమం తప్పకుండా చెప్పిన సమయం కంటే అరగంట ముందే సెట్లో ఉంటున్నాడట. కొన్ని కొన్ని సార్లు పూరినే ఆలస్యంగా సెట్‌కి వెళ్తున్నాడట. 'ఇలాంటి క్రమశిక్షణ ఏ స్టార్లోనీ చూడలేదు' అంటూ బాలయ్యకు కితాబులు ఇస్తున్నాడు పూరి.