బాలయ్య సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

మరిన్ని వార్తలు

ప్రజంట్ టాలీవుడ్ లో ట్రెండ్ ల మీద ట్రెండ్ లు నడుస్తున్నాయి. రీ రిలీజ్ లు, ఒక వైపు. ఇంకో వైపు సీక్వెల్ పర్వం. మరో వైపు డ్యూయల్ రోల్స్. ఈ ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. లేటెస్ట్ గా మహేష్ రాజ మౌళి కాంబోలో వచ్చే మూవీలో మహేష్ మొదటిసారిగా డ్యూయల్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే విశ్వంభర లో త్రిష డ్యూయల్ రోల్ లో నటిస్తోందని తెలుస్తోంది. దీనితో చిరంజీవి కూడా డబుల్ రోల్ అయ్యి ఉండొచ్చని, లేదా ఆవిధంగా ప్లాన్ చేయమని డైరక్టర్ వశిష్టని మెగా ఫాన్స్ రిఖ్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య కూడా  తనకి కలిసివచ్చే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మరోసారి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్.


హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్య నెక్స్ట్ బాబీతో ఒక సినిమా చేస్తున్నాడు.  NBK 109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో  ఊర్వశీ రౌటేలా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు తెలుగులో  ఊర్వశి స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. ఇప్పుడు మొదటి సారి బాలయ్య సరసన హీరోయిన్గా కనిపిస్తోంది. కాగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. బాలయ్య సినిమా అంటేనే మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లతో బాలయ్య మంచి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు బాబీ తో చేస్తున్న సినిమా కూడా మంచి యాక్షన్ డ్రామా అని తెలిసి నందమూరి ఫాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని లేటెస్ట్ అప్డేట్.
   

బాలయ్య డ్యూయల్ రోల్ అంటే హిట్ గ్యారంటీ. అఖండ, వీరసింహారెడ్డి, లెజెండ్, సింహా సినిమాలు డ్యూయల్ రోల్ లో వచ్చి సక్సెస్ అందుకున్నవే. ఇదే తరహాలో ఈ సినిమాకి కూడా ఈ డ్యూయల్ రోల్ సెంటిమెంట్ కలిసి వస్తుందని బాబీ భావిస్తున్నారట. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ లో బాలయ్య సెకండ్ లీడ్ ఎంట్రీ ఉంటుందని, ఈ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. లెజెండ్ తరహాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని బాబీ డిజైన్ చేసారంట. చూడాలి బాలయ్య సెంటిమెంట్ ఎంతవరకు కలిసివస్తుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS