స్టార్ హీరో పుట్టిన రోజు అంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. అందునా బాలకృష్ణ పుట్టిన రోజు వస్తుందంటే.. ఆ సంబరాలు అంబరాన్ని తాకాల్సిందే. ప్రతీ యేటా అభిమానుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం బాలకృష్ణకు అలవాటు. కానీ ఈసారి కరోనా వచ్చింది. అందుకే.. వేడుకలు లేవు. కాకపోతే... అభిమానులంతా ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూ... బాలయ్యకు వినూత్నంగా పుట్టిన రోజు జరపాలని నిర్ణయించారు.
ఈనెల 10 న, ఉదయం సరిగ్గా 10 గంటలకు పది వేల కేకులు కట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు అందజేయబోతున్నారు అభిమానులు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్గా నమోదు చేయించడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ యేడాది బాలయ్య షష్టి పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకోసమే ఈ వినూత్నమైన ఏర్పాటు చేశారు బాలయ్య అభిమానులు. ఎంతైనా.. బాలయ్య ఫ్యాన్స్ సమ్ థింగ్ స్పెషల్ కదా. రికార్డుల వీరుడు బాలయ్యకు తన పుట్టిన రోజున వరల్డ్ రికార్డు బహుమతిగా ఇవ్వబోతున్నారన్నమాట.