విలన్ ఇంట్లో హీరో దూరి.. అక్కడ అల్లరి చేయడం, విలన్ గ్యాంగ్‌ని బకరా చేయడం ఎలాగో శ్రీనువైట్ల ఇండ్రస్ట్రీకి నేర్పించాడు. 'ఢీ' సినిమాతో. మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఇదే ఫార్ములాతో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో విజయాల శాతం కూడా ఎక్కువే. ఇండ్రస్ట్రీకి కొత్త ఫార్ములా ఇచ్చిన `ఢీ`కి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది.
ఈ సినిమాకి 'డీ అండ్ డీ' అనే పేరు పెట్టారని తెలుస్తోంది. 'డేరింగ్ అండ్ డాషింగ్' అన్నది క్యాప్షన్. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. విష్ణు 'మోసగాళ్లు' అనే చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తవగానే ఈసినిమా పట్టాలెక్కుతుంది. 'అమర్ అక్బర్ ఆంటోనీ' లాంటి ఫ్లాపు తరవాత.. మరే హీరో శ్రీనువైట్లతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. సో.. విష్ఱునే ఇప్పుడు వైట్లకు దిక్కుగా మారాడు. ఈచిత్రానికి నిర్మాత కూడా విష్ణునే అని టాక్.