విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ లా కనిపించి బాగానే అలరించారు. అయితే ఆ బయోపిక్ రిజల్ట్ మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. దాంతో బాలయ్య చాల ఫీల్ అయ్యారు. కాగా ఇప్పుడు బాలయ్య మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో నటించాల్సిన అవసరం వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకు బాలయ్యనే ఒప్పించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఎందుకంటే, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఒకరు. ఇప్పుడు ఆయన నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉండటం, ఆ పాత్రలో బాలయ్య అయితేనే ఆ పాత్రకు నిండుతనం వస్తోంది.
ఈ మేరకు విష్ణు ఇందూరి బాలయ్యను నటించమని కోరవచ్చు. మరి బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి మళ్లీ దైర్యం చేస్తాడా ? నిజానికి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ లోని ప్రధానమైన కొన్ని హావభావాలను, బాలయ్య తన ముఖ కవళికల్లో బాగా పలికించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ గా నిలవడంతో బాలయ్య జీర్ణించుకోలేకపోయారు. ఖచ్చితంగా ఆ ప్రభావం ఆయన పై ఇప్పటికీ ఉంటుంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రలో నటిస్తారో లేదో చూడాలి.