'రొమాంటిక్' టీమ్ మళ్లీ రెడీ అవుతుందిగా !

మరిన్ని వార్తలు

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'రొమాంటిక్'. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం గత నెలలో గోవాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుని తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ గోవా షెడ్యూల్ లో సాంగ్స్ తో పాటు కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీశారు. ఇక వచ్చే వారంలో చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో తిరిగి ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌ లో క్లైమాక్స్ స‌న్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షాట్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య నడిచే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా సెట్ వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 

అయితే రమ్యకృష్ణ ప్లేస్ లో మందిరా బేడి ఆల్ రెడీ నటించిందట. కానీ ఆ సీన్స్ బాగా రాకపోవడంతో మందిరా బేడి ప్లేస్ లో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను రీషూట్ చేశారు. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS