#NBK107: బాల‌య్య టైటిల్ ఇదే..!

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రుతి హాస‌న్ క‌థానాయిక‌. చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యిపోయింది. ఈ డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. ద‌స‌రా సంద‌ర్బంగా టైటిల్ ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. కుద‌ర్లేదు. ఈ దీపావ‌ళికి మాత్రం టైటిల్ ఎనౌన్స్ చేయ‌డం ప‌క్కా. ప‌లు టైటిళ్లు ప్ర‌చారంలో ఉన్నాయి. జై బాల‌య్య‌, వీర సింహారెడ్డి, అన్న‌గారు.. ఇవ‌న్నీ ప్ర‌చారంలో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. వీటిలో `అన్నగారు` టైటిల్ కి బాల‌య్య ఓటేశాడ‌ని స‌మాచారం. ఈ టైటిల్ నే.. దీపావ‌ళి రోజున అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. అదే రోజు ఓ టీజ‌ర్‌నీ రిలీజ్ చేస్తారు.

 

ఈ చిత్రంలో బాల‌య్య రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్ర‌స్ లో బాల‌య్య గెట‌ప్ అదిరిపోయింది. అఖండ త‌ర‌వాత‌... బాల‌య్య నుంచి వ‌స్తున్న సినిమా ఇది. క్రాక్ తో హిట్టు కొట్టిన గోపీచంద్ మ‌లినేని.. మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. బుర్రా సాయిమాధ‌వ్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించారు. ఆయ‌న ఈ సినిమా కోసం ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు రాశార‌ని తెలుస్తోంది. అందులో ఓ డైలాగ్ తో టీజ‌ర్ ద‌ద్ద‌రిల్ల‌బోతోంద‌ని టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS