బాలయ్యా నువ్వు సూపరయ్యా!

By iQlikMovies - April 23, 2018 - 16:21 PM IST

మరిన్ని వార్తలు

ఈ రోజుల్లో సినిమాలు 50 రోజులు కాదు కదా, 5 రోజుల ఫంక్షన్స్‌ కూడా చేసుకోలేకపోతున్నాయి. అలాంటిది బాలయ్య 'జై సింహా' సినిమా శతదినోత్సవ వేడుక జరుపుకోవడం నిజంగా గ్రేటే. 

గతంలో 'లెజెండ్‌' సినిమా కూడా రికార్డు రోజులు ప్రదర్శితమై కీర్తికెక్కింది. ఇప్పుడు 'జై సింహా' 100 రోజులు వేడుక జరుపుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ రోజుల్లో ఏ హీరోకీ లేని ఘనత బాలయ్యకుందని చెప్పక తప్పడం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన 'బాహుబలి' సినిమాకి కూడా ఇలా శతదినోత్సవ వేడుకలు జరపలేదు. దేశ దేశాల కీర్తి గడించినా, 'బాహుబలి' ఖాతాలో శత దినోత్సవ రికార్డు మాత్రం లేదు. 

'బాహుబలి'కే కాదు, ఈ మధ్య కాలంలో సక్సెస్‌ అనిపించుకున్న ఏ సినిమాకీ లేని ఘనత బాలయ్య సినిమాలకే చెల్లుతుంది. ఈ పరిణామాలను బట్టి, బాలయ్యను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని పరిస్థితి కొంతమందికి. బాలయ్య ఇంకా పాతరోజుల్లోనే ఉన్నాడే అని కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో బాలయ్యని మెచ్చుకొని తీరాల్సిందే. 

అంతేకాదు, ఇలా బాలయ్య సినిమాలకు 50 రోజులు, 100 రోజుల సక్సెస్‌ ఫంక్షన్స్‌ నిర్వహించడంతో కొంతమందికి ఉపాధి కూడా లభిస్తోంది. ఆ రకంగానూ బాలయ్యని అభినందించాల్సిందే. మరో పక్క తాజాగా బాలయ్య 'ఎన్టీఆర్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలయ్య, తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS