'భరత్‌'కి ఇంప్రెస్‌ అయిన సుక్కు.!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాతో సుకుమార్‌ పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. చరణ్‌ లాంటి హీరోతో 'రంగస్థలం' లాంటి సినిమాని తీసి, రికార్డు స్థాయిలో హిట్‌ కొట్టిన క్రెడిట్‌ డైరెక్టర్‌గా సుకుమార్‌కే చెల్లింది. కెరీర్‌ బెస్ట్‌ మూవీగా సుకుమార్‌ ఖాతాలో 'రంగస్థలం' ఎప్పటికీ నిలిచిపోతుంది.

 

ఇకపోతే ఇంత పెద్ద హిట్‌ కొట్టాక, సుకుమార్‌ నెక్ట్స్‌ చేయబోయే సినిమా ఏమై ఉంటుందా? అని అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌ మనసులో ఉన్న హీరో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అని ఈ మధ్య చాలా సార్లు చెబుతూ వస్తున్నాడు. అయితే మరి వీరిద్దరి కాంబినేషన్‌లోనే సుక్కు నెక్ట్స్‌ సినిమా ఉండబోతోందా? అవను, ఈ కలయికలో ఒక చిత్రం రాబోతున్నది అని నిన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఈ ప్రకటన ప్రకారం, #SSMB26 అనగా మహేష్-వంశీ పైడిపల్లి చిత్రం తరువాత మహేష్-సుకుమార్ కలయికలో ఒక చిత్రం ప్రారంభం కానున్నది. దీనితో ఈ వార్త మహేష్ అభిమానుల్లో అలాగే సుకుమార్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే వీరిరువురి కలయికలో ఇంతకముందు వచ్చిన చిత్రం పరాజయం చవిచూడడంతో తప్పకుండా ఈ సారి వీరి కలయికలో ఒక మంచి హిట్ చిత్రం రానుంది అని అందరు అంచనా వేస్తున్నారు.

ఈ సంగతిటుంచితే, తాజాగా సుకుమార్‌ 'భరత్‌ అనే నేను' సినిమా చూశాడట. మహేష్‌ తప్ప ఇంకెవ్వరూ చేయని బెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇది. పక్కా మాస్టర్‌ క్లాస్‌ మూవీ.. అంటూ భరత్‌ టీమ్‌ని ప్రశంసలతో ముంచెత్తేశాడు సుకుమార్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS