బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ ఆడియో విడుదలకి ముహూర్తం ఖరారైంది.
ఈ నెల 24వ తేదిన బాలకృష్ణ జై సింహ ఆడియోని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ ఆడియో వేడుకని విజయవాడ లోని వజ్ర గ్రౌండ్స్ నందు జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాత సి కళ్యాణ్ ఈ ఆడియో విడుదల వేడుకలు భారీ ఎత్తున్న జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట.
జై సింహ ఆడియో వేడుకకి సంబంధించి ఇప్పటికే బాలకృష్ణ అభిమానులకి సమాచారం అందినట్టు, వారు కూడా భారీ సంఖ్యలో ఈ వేడుకకి తరలి రానున్నట్టు సమాచారం. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందివనుండగా ప్రముఖ దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలావుండగా బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు- నయనతార, నటాషా, హరిప్రియ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.