జై సింహ సెన్సార్ అప్డేట్!

మరిన్ని వార్తలు

నటసింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి తన తాజా చిత్రం జై సింహతో దిగుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి.

ఇక ఈ చిత్రం ఈరోజు సెన్సార్ బోర్డు ముందుకి రానుంది. మధ్యాహ్నం 2గంటల సమయంలో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాని వీక్షించనున్నట్టు సమాచారం. ఈరోజు సెన్సార్ పూర్తయితే ఇక ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రావడానికి లైన్ క్లియర్ అయినట్టే.

ఇదిలావుండగా జైసింహ చిత్రంలో బాలకృష్ణ తన అభిమానులని మెప్పించే విధంగా డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్స్ చేసారు అని ఇప్పటికే విడుదలైన జై సింహ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు బాలకృష్ణ సరసన నటిస్తున్నారు.

ప్రముఖ తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా C కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS