సినిమా షూటింగ్ మొదలయ్యే ఆఖరి నిమిషంలో లేక ఆఖరికి షూటింగ్ మొదలయ్యాక కూడా హీరోయిన్ ని మార్చడం వంటివి సర్వసాధారణ విషయలే. అయితే క్రేజ్ లో ఉన్న హీరోయిన్ కోసం మరో హీరోయిన్ ని తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
వివరాల్లోకి వెళితే, తమిళ హీరో విజయ్ 62వ చిత్రం ఫిబ్రవరిలో మొదలుకానుంది. అయితే ఆ చిత్రంలో ముందుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ని అనుకున్నారు, తరువాత కారణాలు ఏంటో తెలియదు కాని ఆమెని తప్పించి కీర్తి సురేష్ ని ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఇదే సమయంలో మరొక చిత్రం నుండి కూడా ఆఖరి నిమిషంలో ఆమెని తొలిగించి మరొక హీరోయిన్ ని తీసుకోవడం కొత్త చర్చకి దారి తీసింది. అయితే ఆమె మార్పునకి కారణం ఆమెకి ఇప్పుడు సక్సెస్ లేకపోవడమే అని అర్ధమవుతుంది.
మొత్తానికి ఫిలిం ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే ఏదైనా అనేది మరోసారి నిరూపితమైంది.