నందమూరి బాలకృష్ణ - కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 'రూలర్' అనే పేరు కూడా బయటకు వచ్చింది. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఈనెలలోనే ప్రారంభం కావాల్సివుంది. అయితే అంతలోనే ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. దానికి కారణం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లేనని సమాచారం. ఈ సినిమాలో వై.ఎస్.జగన్‌ని పోలిన పాత్ర ఒకటుందని తెలుస్తోంది. ఆ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నార్ట.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ వస్తే.. ఈ సినిమా పట్టాలెక్కేదని, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈసినిమాని పట్టాలెక్కించడం కుదరని పని అని ఫిల్మ్‌నగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈనెల 18న ఈ సినిమా మొదలవ్వాల్సింది.కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక షూటింగ్ మొదలెడదామని భావించారు. ఎన్నికల ఫలితాలు టీడీపీ పార్టీ కి వ్యతిరేకంగా రావడంతో ఈ సినిమా ఆగిపోయింది. కథలో మార్పులు చేర్పులూ చేసి ఈ సినిమా పట్టాలెక్కించే ఛాన్సుందని ఓ వర్గం గట్టిగా చెబుతోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..??