ఎన్టీఆర్ అభిమానుల్ని టెన్ష‌న్ పెడుతున్న 'గాయం'

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ అభిమానుల్ని టెన్ష‌న్ పెడుతున్న 'గాయం' ఎన్టీఆర్ ఈమ‌ధ్య అనుకోని విధంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ చేతికి గాయ‌మ‌వ్వ‌డంతో 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' షూటింగ్‌లోనూ పాల్లోలేక‌పోయాడు. అంతకు ముందే రామ్ చ‌ర‌ణ్‌కూడా జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ గాయ‌ప‌డ్డాడు. దాంతో ఇద్ద‌రు హీరోలూ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'కి అందుబాటులో లేకుండా పోయారు. దాంతో షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఎన్టీఆర్ గాయం నుంచి కోలుకున్నాడ‌ని, 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' షూటింగ్ య‌ధావిధిగా జ‌రుగుతోంద‌ని వార్త‌లొచ్చాయి.

 

అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం వేసిన ప్ర‌త్యేక సెట్లో షూటింగ్ జ‌రుగుతుంద‌ని చెప్పుకున్నారు. అయితే... ఎన్టీఆర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేద‌ని నిర్దార‌ణ అయ్యింది. ఈరోజు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా తాత‌య్య‌కు నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఘాట్‌కి వ‌చ్చాడు జూనియ‌ర్‌. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ చేతికి క‌ట్టు క‌నిపించింది. అంటే.. ఎన్టీఆర్ ఇంకా గాయం నుంచి కోలుకోలేద‌న్న‌మాట‌.

 

గాయం నుంచి కోలుకుంటే త‌ప్ప‌... `ఆర్‌.ఆర్‌.ఆర్‌` సెట్లో అడుగుపెట్టే అవ‌కాశ‌మే లేదు. అలాంట‌ప్పుడు... 'ఆర్‌.ఆర్.ఆర్‌' షూటింగ్ మ‌ళ్లీ మొద‌లైంద‌న్న మాట‌ల్లో వాస్త‌వం లేద‌న్న‌మాట‌. ఎన్టీఆర్ చేతికి క‌నిపిస్తున్న క‌ట్టు.. అభిమానుల గుండెల్లో గుబులు పెంచుతోంది. గాయం ఇంకా పెద్ద‌దైందా? లేదంటే గాయాన్ని లెక్క చేయ‌కుండా ఎన్టీఆర్ షూటింగులో పాల్గొంటున్నాడా? అంటూ టెన్ష‌న్ ప‌డుతున్నారు తార‌క్ ఫ్యాన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS