హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ 'ఎఫ్ 2'లో ఆకట్టుకుంది మెహరీన్. అంతకు ముందు వరకూ మెహరీన్ ఖాతాలో పెద్దగా విజయాల్లేవు. ఈ సినిమాతో తనకు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం నాగశౌర్యతో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పక్కన ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
ఇందులో కథానాయికగా మెహరీన్ ఎంపికైందని సమాచారం. మెహరీన్ ఎంపిక దాదాపు ఖాయమని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తెలుస్తోంది. మరో కథానాయికగా ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుట్ ని ఇది వరకే ఎంచుకున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారని చిత్రబృందం ముందే చెప్పింది. సో.. ఇద్దరి ఎంపికా అయిపోయిందన్నమాట. ఈనెలలోనే ఈ సినిమా లాంఛనంగా మొదలవ్వబోతోంది. అక్టోబరులో విడుదల కానుంది.