త్వరలో మనముందుకు బాబాయ్-అబ్బాయి

By iQlikMovies - March 21, 2018 - 18:59 PM IST

మరిన్ని వార్తలు

ఈమధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రాలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. ఇక అదే కోవలో తాజాగా ఒక నందమూరి మల్టీ స్టారర్ రూపొందబోతున్నట్టు ఫిలిం నగర్ సమాచారం.

ఇక ఆ వివరాల్లోకి వెళితే, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా అదే సమయంలో హీరో కూడా నటించడానికి ఒక కథ సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కథలో మరొక హీరోకి కూడా చోటు ఉండడంతో ఆ పాత్ర ని తన బాబాయి అయిన బాలకృష్ణ తో చేయించాలని అనుకుంటున్నాడట.

త్వరలోనే ఈ కథని బాలకృష్ణ కి వినపించబోతున్నాడట. అన్ని కుదిరితే ఈ చిత్రం మే నెల తరువాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ మల్టీ స్టారర్ ప్రకటన మాత్రం బాలయ్య కథ విన్న తరువాతే అని తెలిసింది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నా నువ్వే చిత్రంతో అలాగే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ల తో బిజీ గా ఉన్నారు. మొత్తానికి ఇది నందమూరి అభిమానులకి ఆనందాన్ని ఇచ్చే వార్త.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS