నటనపరంగానే కాకుండా వివాదాల వల్ల కూడా వార్తల్లో నిలిచిన నటి కంగనా రనౌత్. తాజాగా ఆమె పేరు ఒక స్కాం లో ప్రముఖంగా వినిపిస్తున్నది. అందుతున్న సమాచారం ప్రకారం, ఆమెతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది రిజ్వాన్ కి ముంబై పోలీసులు కాల్ డేటా రికార్డ్స్ (CDR) స్కాం క్రింద సామాన్లు జారీ చేశారు. ఇదే స్కాంలో ప్రముఖ సెలబ్రిటీలు అయిన కంగనా అలాగే హీరో జాకీ ష్రాఫ్ భార్య అయిన అయేషా కి సామాన్లు పంపించినట్టు ఇప్పుడు బాలీవుడ్ కోడై కూస్తున్నది.
అయితే ఈ సమన్ల ఆరోపణలని కంగనా చెల్లెలు తీవ్రంగా ఖండించడంతో పాటుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ చెప్పింది. అయేషా ష్రాఫ్ మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదిలావుండగా మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఈ స్కాంలో బయటపడతాయి అని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి కంగనా రనౌత్ మరోసారి హల్చల్ చేస్తున్నది.