బాలకృష్ణ తాజా చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్‌లోనే థాయ్‌లాండ్ అందాల్ని ఆస్వాదించేశారు. అందమైన హీరోయిన్స్‌తో రొమాంటిక్ స్టెప్పులేశారు. రొమాన్స్‌తో పాటు, ఫైట్స్ కూడా ఇరగదీసేశారు. దాదాపు 20 రోజుల పాటు జరిగిన థాయ్‌లాండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని, హైద్రాబాద్ తిరిగొచ్చిన బాలయ్య నెక్స్ట్ షెడ్యూల్ కోసం కసరత్తులు చేస్తున్నారట.
థాయ్‌లాండ్ షెడ్యూల్ కోసం తన గెటప్ మొత్తం మార్చేసి, పూర్తిగా స్టైలిష్ అండ్ హ్యాండ్‌సమ్ లుక్స్‌లోకి వచ్చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్స్‌లో బాలయ్య కనిపించారు. ఇక తాజా షెడ్యూల్‌ని హైద్రాబాద్‌లో ప్లాన్ చేయనున్నారనీ సమాచారమ్. అందుకోసం ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారట. ఆ భారీ సెట్‌లో రెండో షెడ్యూల్‌కి రంగం సిద్ధం చేస్తున్నారట. మరి కొద్దిరోజుల్లోనే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ పోషిస్తున్నారని సమాచారం. సో సెకండ్ షెడ్యూల్ కోసం మరో డిఫరెంట్ గెటప్‌లో బాలయ్య కనిపించనున్నారట. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్సే. సోనాల్ చౌహాన్, వేదిక హీరయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్‌తో కలిసి బాలయ్య నిర్మిస్తున్నారు.