ఛలో ఇండియా టాస్క్‌తో బుధ, గురు వారాల బిగ్‌బాస్ ఎపిసోడ్స్ ఫన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. బిగ్‌బాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి హౌస్ మేట్స్ ఇండియాలోని పలు సుందరమైన ప్రదేశాల్ని చుట్టి వచ్చేశారు. ట్రైన్ ఆగిన చోట డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్‌ల్లో పాల్గొని, ఆటని మరింత రక్తి కటించారు మన ప్రియమైన కంటెస్టెంట్లు. ట్రైన్‌లో వారి వారి బిహేవియర్‌తో వీక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచారు.
ఇక చివరిగా ఆయా టాస్క్‌ల్లో బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చిన ముగ్గురిని హౌస్‌మేట్స్ ఏకాభిప్రాయంతో ఎంచుకుని చెప్పమన్నాడు బిగ్‌బాస్. అందరి నోటి నుండి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ పేర్లు వినిపించాయి. దాంతో ఈ ముగ్గురూ కెప్టెన్సీ టాస్క్‌కి పోటీ పడవల్సి వుందని బిగ్‌బాస్ సూచించారు. కెప్టెన్సీ టాస్క్ కోసం బురద మట్టిని సిద్ధం చేశారు. ఈ బురద మట్టిలో అదిరిపోయే యాక్షన్ జరగనుంది. ఈ యాక్షన్ సీన్‌లో బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ నువ్వా ? నేనా? అనేలా తలపడనున్నారు.
మరి కెప్టెన్సీ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే స్టే టూన్‌డ్ బిగ్‌బాస్. ఇకపోతే, ఈ ముగ్గురిలో ఆల్రెడీ వరుణ్ ఒకసారి కెప్టెన్సీ రుచి చూసేశాడు. అయితే, తొలి కెప్టెన్ కావడంతో, కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వర్తించడంలో వరుణ్ ఫెయిలయ్యాడు. మరి రెండోసారి కూడా వరుణే కెప్టెన్సీ దక్కించుకుంటాడా.? లేక మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ ఛాన్స్ దక్కించుకుంటారా.? అనేది వేచి చూడాలిక.