మామూలు కమర్షియల్ హీరోయిన్స్ రూటులోనే గ్లామర్ డాళ్‌గా పరిచయమైన పంజాబీ భామ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అన్నీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్నే ఎంచుకుంటోంది. బాలీవుడ్‌లో అస్సలు గ్లామర్‌కి చోటే ఇవ్వలేదు తాప్సీ. హీరోలకు ధీటైన పాత్రలతో ఆకట్టుకుంటోంది. అతి కొద్ది టైంలోనే అక్కడ స్టార్ హీరోయిన్ హోదాని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో తన స్టామినా ఇదీ అని ప్రూవ్ చేసుకున్నాక, ఇప్పుడిప్పుడే సౌత్ సినిమాల పైనా దృష్టి పెడుతోంది. ఏడాదికి ఒక సినిమా అయినా సౌత్‌లో నటిస్తానంటోంది. ఒకప్పుడు సౌత్ సినీ రంగంపై ఆడి పోసుకున్న తాప్సీ, ఇప్పుడు సౌత్‌పై తనకెంలాంటి కోపం లేదనీ చెబుతోంది.
అన్నట్లు గ్లామర్ రోల్స్ అయితే నిరభ్యంతరంగా రిజక్ట్ చేస్తుందట. ప్రాధాన్యత ఉన్న కథలయితేనే తన వద్దకు తీసుకురావాలన్నట్లుగా సౌత్ దర్శక, నిర్మాతలకు సంకేతాలు పంపుతోందట తాప్సీ. ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' సినిమా తెరకెక్కింది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ డెవలపర్‌గా నటిస్తోంది తాప్సీ ఈ సినిమాలో. తాప్సీ ఒప్పుకుందంటేనే ఈ సినిమాలో సమ్‌థింగ్ డిఫరెంట్ విషయమేదో దాగున్నదన్నట్లే. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా కథనం సాగుతుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ అనీ ప్రచార చిత్రాల ద్వారా అర్ధమైంది. ఇంటర్నేషనల్ వేల్యూస్‌తో సింప్లీ సూపర్బ్‌గా ఈ సినిమాని రూపొందించారు. అశ్విన్ శరవణన్ ఈ సినిమాకి దర్శకుడు.
తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్ హిందీలో విడుదల చేస్తున్నారు. ఏది ఏమైనా తాప్సీని ఇకపై గ్లామర్ హీరోయిన్‌గా చూడలేమని కన్‌ఫామ్ అయిపోయింది. 'గేమ్ ఓవర్'తో పాటు, బాలీవుడ్‌లో ఆగస్ట్ 15న 'మిషన్ మంగళ్'తోనూ, దీపావళికి 'సాండ్ కీ ఆంఖ్'తోనూ తాప్సీ సందడి చేయనుంది. వీటితో పాటు, మూడు భాషల్లోనూ తదుపరి ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయట. సో ఇప్పుడప్పుడే తాప్సీ డైరీ పూర్తయ్యేలా లేదు మరి.