బాలయ్య గుండు వెనుక కధ ఇది

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసిన గుండుతో దర్శనమిస్తున్నారు. దీనితో బోయపాటి సినిమాలో బాలయ్య అఘోరగా కనిపిస్తారని, అందుకే ఈ గుండు లుక్ అని అంతా అనుకుంటున్నారు. అయితే అసలు విషయం మాత్రం ఇది కాదు. బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంట్టేషన్ ని ఆశ్రయించారు. బాలయ్య జుట్టు ఎప్పుడో పలుచబడిపోయింది. కొన్నేళ్ళుగా ఆయన విగ్గులని ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఈ విగ్గులు మరీ కృత్రిమంగా కనిపిస్తున్నాయి. 'రూలర్' లో వాడిన విగ్గులు చూసి జనాలు తట్టుకోలేకపోయారు. ఈ సంగతి బాలయ్య ద్రుష్టిలోకి వెళ్ళింది. బోయపాటి కూడా అదే ఫీలయ్యారు. ఈసారి నేచురల్ గా కనిపించాలానే నిర్ణయానికి వచ్చారు. కొంచెం ఎక్కువ శ్రద్ద తీసుకొని హెయిర్ ప్యాచ్ లని డిజైన్ చేయాలని బోయపాటి అనుకున్నారు.

 

కానీ బాలయ్య మాత్రం ఏకంగా హెయిర్ ప్లాంటేషన్ వైపు మొగ్గు చూపారు. అమెరికాలో ఓ పేరున్న సంస్థలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా పోయిన జుట్టుని తీసుకురావడం సాధ్యపడటం లేదు. వచ్చినా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వుంటుంది కొత్త జుట్టు. బేసిగ్గా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్టేషన్ చేసుకుంటే జుట్టు వస్తుంది కానీ అది కెమరాకి సరిపడే థిక్ నెస్ కి సెట్ అవుతుందా అనే అనుమానం ఒకటి వుంది. దానికి తోడు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్టేషన్ తో కొన్ని కాంప్లికేషన్స్ వున్నాయి. అయితే అమెరికాలో ఓ సంస్థ మాత్రం దీనికి గ్యారెంటీ ఇస్తుంది. ఇక బాలయ్య కూడా విగ్గుల నుండి విముక్తి పొందాలనే డిసైడ్ అయ్యారు. బాలయ్య డిసైడ్ అయితే అంతే. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్టేషన్ కొన్ని దశల్లో జరగనుంది. అప్పటి వరకూ బాలయ్య ఇలా గుండుతోనే కనిపిస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS