కరోనా ప్రభావం ఎలా ఉన్నా, షూటింగులకు అనుమతులు రావడంతో.. మెల్లమెల్లగా షూటింగుల సందడి మొదలైంది. పెద్ద స్టార్లు కూడా సెట్లో అడుగుపెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమా కూడా ఈ నెలలోనే మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. కొత్త షెడ్యూల్ కి బోయపాటి ఆల్రెడీ రంగం సిద్ధం చేశారని అనుకున్నారు. అయితే... ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కాబోతోందని సమాచారం.
డిసెంబరులో తప్ప బాలయ్య సెట్లో కి అడుగుపెట్టబోడని, అప్పుడే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. దాంతో.. బోయపాటి కూడా డిసెంబరులోనే ఈసినిమా మొదలెట్టాలని ఫిక్సయ్యాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన చాలా టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకదాన్ని త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నార్ట. దసరా సందర్భంగా టైటిల్ ని ప్రకటిస్తారని తెలుస్తోంది. నరేష్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ లేదు.