కంగనా రనౌత్ కొన్నాళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకుందట. ఆ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది. ఇది చాలాకాలం క్రితం జరిగింది. ఆమె, తాను డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని చెప్పిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అప్పట్లో కంగనకి డ్రగ్స్ సరఫరా చేసిందెవరు? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతోంది. కంగనపై గుర్రుగా వున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు.. ఈ కోణంలో కంగనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టబోతున్నారని సమాచారం.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి కూడా ఆ వీడియో వెళ్ళిందనే ప్రచారం జరుగుతోంది. కాగా, కంగనా రనౌత్‌కి ఓ దర్శకుడు అత్యంత సన్నిహితుడనీ, అతని పేరు తాజా డ్రగ్స్ వివాదంలోనూ వినిపిస్తోందనీ నేషనల్ మీడియా కోడై కూసేస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరు.? అని ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆ దర్శకుడు కంగనతో ఓ సినిమా కూడా చేశాడట. సౌత్‌కి చెందిన ఓ దర్శకుడు.. అని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘ఛాన్సే లేదు, అతను బాలీవుడ్ దర్శకుడే’ అని కూడా కొన్ని ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, కంగన మాత్రం ప్రస్తుతం చాలామంది బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకందారులు వున్నారని ఆరోపిస్తోంది. తనకూ డ్రగ్స్‌కీ ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. మరి, ఆ పాత వీడియో సంగతేంటి.? అది ఆమెను చిక్కుల్లో పడేస్తుందా? వేచి చూడాలిక.