తండ్రి దారిలోనే నడుస్తున్న బాలయ్య

మరిన్ని వార్తలు

నటసింహం బాలకృష్ణకి తన తండ్రి పట్ల ఎటువంటి ఆరాధన ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇకఆ ప్రేమనే ఆయన జీవితం పైన ఒక చిత్రాన్ని నిర్మించే పనిలో పడ్డాడు.

ఈమధ్యనే ఆ బయోపిక్ సంబందించిన టీజర్ ఒకటి ఎన్టీఆర్ వర్ధంతి అయిన జనవరి 18న విడుదల చేయడానికి షూటింగ్ జరిపించారు. అయితే ఆ షూటింగ్ లో “దాన వీర సూర కర్ణ” చిత్రంలో ఎన్టీఆర్ వాడిన గద, కిరీటం ఆభరణాలు వంటివి వీరు తీయబోయే చిత్రంలో కూడా వాడుతున్నారట. ఈ సంగతి నందమూరి అభిమానుల్లో ఆనందం నింపనుంది.

ఇప్పటికే ఎన్టీఆర్ జీవితం పైన చిత్రం ఎలా ఉండబోతుంది అన్న తరుణంలో ఈ వార్త సినిమా పైన అంచనాలని రెట్టింపు చేస్తున్నది. ఇక ఇదే సమయంలో బాలకృష్ణ కూడా తన తండ్రి పాత్రలో ఆయన ఒకప్పుడు వాడిన ఆభరణాలతోనే నటించనుండడం విశేషం.

మొత్తానికి ఈ బయోపిక్ నిండా ఆసక్తికర విశేషాలు ఉండబోతున్నట్టు అర్ధమవుతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS