బాలయ్య 'ఎన్టీఆర్‌'కు లీకుల గోల

By iQlikMovies - July 11, 2018 - 14:15 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య సినిమాలకు లీకేజీల తంటా వెంటాడుతోంది. సినిమా ఇంకా ధియేటర్స్‌లోకి రాకముందే, షూటింగ్‌ స్పాట్స్‌ నుండే లీకేజ్‌ అయిపోతోంది. స్మార్ట్‌ ఫోన్‌లొచ్చేయడంతో, లీకులు చాలా ఈజీ అయిపోయాయి. ఫలానా సినిమా మేకింగ్‌ వీడియోలివిగో, ఫోటోలివిగో అంటూ ఎక్స్‌క్లూజివ్‌గా నెట్టింట్లో పోస్ట్‌లు వచ్చేస్తున్నాయి. మహేష్‌బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రానికి సంబంధించి ఈ మధ్య కొన్ని ఫోటోలు అలాగే హల్‌చల్‌ చేశాయి. 

తాజాగా బాలయ్య నటిస్తున్న 'ఎన్టీఆర్‌' సినిమా నుండి ఓ ఫోటో లీకయ్యింది. ఈ ఫోటోలో బాలయ్య పౌరాణిక గెటప్‌లో ఉన్నారు. ఇదేదో మార్ఫింగ్‌ ఫోటో అనుకుంటే పొరపాటే. అదే ఫోటోలో నటుడు మురళీశర్మ కూడా కనిపిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా 'ఎన్టీఆర్‌' సినిమాలోనిదే అని ఆడియన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు. అంతేకాదు, సినిమాకి సంబంధించి వీడియో పుటేజ్‌ కూడా లీకయ్యిందంటూ వార్తలొస్తున్నాయి.

 

ఇదెంత వరకూ నిజమో తెలీదు కానీ, ఏది ఏమైనా ఈ లీకుల గోల కూసింత దర్శక, నిర్మాతలను ఇరకాటంలో పడేస్తున్నట్లే. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏదో మూల నుండి లీకులు సినిమాల్ని బాధిస్తున్నాయి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్న సినిమాలు అర్ధాంతరంగా ఇలా లీకైపోతుంటే, తట్టుకోవడం కష్టమే మరి. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాలయ్య నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS