బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ మొదలయ్యే ముందే నాని ఈ సారి “ఇంకొంచెం మసాలా” అంటూనే “ఏదైనా జరగోచ్చు” ఒక హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులు కూడా “ఏదైనా జరగోచ్చు” అన్న ట్యాగ్ లైన్ కి న్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు.
దీనికి మంచి ఉదాహరణ నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ లో మనం చూడొచ్చు. ఇప్పటివరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న– అమిత్ & భాను తమ స్నేహానికి ఇబ్బందులు తెచ్చుకోగా ఎప్పుడు కొట్టుకుంటునే ఉంటారు అన్న పేరున్న తేజస్వి-గీత మధ్యలో ఈ టాస్క్ తో ఒకరిపైన ఒకరికి ఉన్న కోపాలు పోయి స్నేహం చిగురించింది అనే చెప్పాలి.
ఇక నిన్నటి ఎపిసోడ్ కి టైటిల్ కూడా అసలు రంగులు బయటపెట్టడం అని పెట్టడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యుల గురించిన అసలు రూపం బయటికి వచ్చింది అని నిన్నటి ఎపిసోడ్ చూసిన వారు అంటున్నారు.
ఏదేమైనా.. నిన్నటి ఎపిసోడ్ చూసాక రాబోయే కాలంలో మరింత మసాలాతో ఉండబోతుంది అన్న అభిప్రాయం మనకి కలుగుతుంది.