బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె త్వరలోనే ఓ ఇంటిదవబోతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో ఉన్న దీపికా పదుకొనె ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోబోతోంది. నవంబర్ 15న వివాహ బంధంతో ఒక్కటి కానున్నామని అధికారికంగా ప్రకటించారు దీపికా - రణ్‌వీర్ సింగ్.
ఇటలీలో ఇరు కుటుంబాల అతిథులు, స్నేహితులతో పాటు, అభిమానుల మధ్య వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది. రెండు రకాల సాంప్రదాయాల్లో ఈ వివాహం జరగనుందట. దీపికా బెంగుళూరుకు చెందిన అమ్మాయి. రణ్‌వీర్ సింగ్ మహారాష్ట్రకు చెందిన సింథి కుటుంబస్ధుడు. అందుకే వీరి వివాహం ఇరు కుటుంబాల సాంప్రదాయాలకనుగుణంగా జరిపేందుకు పెద్దలు నిశ్చయించినారు. టాలీవుడ్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత కూడా ఇలాగే రెండు రకాల సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్న సంగతి విదితమే.
ఇకపోతే దీపికా, రణ్‌వీర్ ఆన్‌స్క్రీన్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2013 నవంబర్‌లో వచ్చిన 'రామ్‌లీలా' చిత్రంతో దీపికా - రణ్‌వీర్ పెయిర్ బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ పెయిర్‌గా పాపులర్ అయింది ఆ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ యూత్‌కి గిలిగింతలు పెట్టించింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరిరువురి మధ్యా ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త ముదిరి ముదిరి ఇప్పుడు పెళ్లిదాకా చేరింది.
ఏది ఏమైనా ఇది దీపికా, రణ్‌వీర్ అభిమానులకు శుభవార్త అని చెప్పాలి. గతేడాది 'పద్మావత్' చిత్రంలో దీపికా హీరోయిన్‌గా, రణ్‌వీర్ సింగ్ విలన్‌గా నటించారు. పలు వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.