50 ముద్దులు పెట్టించేశాడు.!

మరిన్ని వార్తలు

'మీ టూ' ప్రకంపనలు సినీ రంగాన్ని కుదిపేస్తున్న తరుణంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. 

తాజాగా కన్నడ నటి సంజన ఈ విషయమై గళం విప్పింది. 'గండహెండాత్తి' అనే ఓ కన్నడ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ ముద్దు సన్నివేశం ఉంటుందని ఆ సినిమా డైరెక్టర్‌ ఆమెను బలవంతంగా ఒప్పించాడట. సంజన కాస్త అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఆ సీన్‌ చిత్రీకరణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని డైరెక్టర్‌ భరోసా ఇచ్చాడట. తల్లితో కలిసి షూటింగ్‌కి వెళ్లిన సంజనపై సదరు డైరెక్టర్‌ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడట. ఆమె తల్లిని లోనికి రానివ్వలేదు.. సరి కదా, ఒక్క ముద్దు సీన్‌ అని చెప్పి, 50 ముద్దు సీన్స్‌ వరకూ షూట్స్‌ చేశారట. 

ఒకే షాట్‌ని పదే పదే చేయడం, మానసికంగా హింసించడం చేశారనీ సంజన బాధపడింది. అలాగే ఓ తెలుగు నిర్మాత కూడా తనను దారుణంగా వేధించానీ అయితే అతని ఆటలు సాగనివ్వలేదనీ సంజన చెప్పుకొచ్చింది. ఇలా తమపై జరుగుతున్న లైంగిక చర్యలకు బయటికి వచ్చి చెబుతున్న వాళ్లు ఒక్కరు ఇద్దరు మాత్రమే. అలా చెప్పుకోలేక బాధపడుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు సినీ పరిశ్రమలో. కొంతమంది మంచోళ్లున్నా, చాలా మంది మృగాళ్లున్నారు అని చెప్పుకొచ్చింది తాజాగా ఈ కన్నడ బ్యూటీ. 

మరోవైపు తమిళ డైరెక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ త్యాగరాజన్‌పై ప్రీతికా మీనన్‌ అనే ఓ స్టిల్‌ ఫోటో గ్రాఫర్‌ ఓ సినిమా షూటింగ్‌ సమయంలో తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. తమిళ సినీ పరిశ్రమలో చాలా పెద్ద పేరున్నోడు అందుకే ఆ రోజు మాట్లాడ లేకపోయాను అని ఆమె చెప్పింది. 

ఆమె ఆరోపణలపై ఈ రోజు వివరణ ఇవ్వబోతున్నాడు త్యాగరాజన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS