కథానాయకులెప్పుడూ పారితోషికాల విషయంలో రాజీ పడరు. మరీ ముఖ్యంగా అగ్ర కథానాయకులు. నాకింత ఇస్తేనే చేస్తా - అంటూ భీష్మించుకుని కూర్చుంటారు. వాళ్లకున్న ఇమేజ్, క్రేజ్ అలాంటివి. వాళ్లని చూసే జనాలు థియేటర్లకు వస్తారు కాబట్టి... ఆ డిమాండ్లని తప్పుపట్టకూడదు. కానీ బాలకృష్ణ అలా కాదు. కథ నచ్చితే, దర్శక నిర్మాతల అప్రోచ్ నచ్చితే - ఎలాండి డాంబికాలూ లేకుండా సినిమాల్ని ఒప్పుకుంటాడు. తన పారితోషికం ఎంతన్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు. నిర్మాత ఎంతిచ్చినా పుచ్చుకుంటాడని పరిశ్రమలో బాలయ్య గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెబుతుంటారు. కానీ ఎప్పుడూ లేనిది బాలయ్య ఈ విషయంలో బాగా మారాడని అనిపిస్తోంది.
ఈమధ్య బాలకృష్ణ పారితోషికం విషయంలో పేచీ పెడుతున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆమధ్య రూలర్ సినిమా విషయంలో పారితోషికం దగ్గర బాలయ్య గట్టిగా డిమాండ్ చేశాడని టాక్ వినిపించింది. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా విషయంలోనూ అంతే. ఈ సినిమాకి ఏకంగా 9 కోట్ల పారితోషికం అడుగుతున్నాడట. బాలయ్య మార్కెట్ అంతగా లేదని, అంత ఇవ్వలేనని నిర్మాత చెబుతున్నా బాలయ్య వినడం లేదని టాక్. పైగా ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే మితిమీరిపోయింది. దాన్ని తగ్గించుకోవడానికి నిర్మాత ఆపసోపాలు పడుతున్నాడు. బాలయ్య తన పారితోషికం తగ్గించుకుని, తనకు అండదండగా ఉంటాడని అనుకుంటే.. ఇలా గుంజి మరీ డబ్బులు లాగుతున్నాడని తెగ బాధపడిపోతున్నాడట నిర్మాత. బాలయ్యలో ఈ ఊహించని మార్పేమిటో..?