కాజల్‌కి పెద్ద చిక్కే వచ్చిందే.!

మరిన్ని వార్తలు

ఛాన్సెస్‌ తగ్గిపోయాయనుకున్న టైమ్‌లో మెగాస్టార్‌ సరసన ‘ఖైదీ నెంబర్‌ 150’లో ఛాన్స్‌ కొట్టి, మెగా హీరోయిన్‌ అనిపించుకుంది కాజల్‌ అగర్వాల్‌. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాల్లో సందడి చేసి, కెరీర్‌ని సో సోగా నడిపించేసింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది కాజల్‌ అగర్వాల్‌. ఈ టైమ్‌లో ‘ఇండియన్‌ 2’ రూపంలో తాను కోరుకున్న కల నెరవేరబోతోందని సంబరపడిరది. కామెడీకి కూడా ఈ సినిమా ఆగిపోయిందనే గాసిప్‌ని తట్టుకోలేకపోయింది. ఎప్పటికప్పుడే వచ్చిన రూమర్స్‌ని తెగువతో తోసి పుచ్చింది. అయితే, ఇక ఇప్పుడు కాజల్‌ పాప ఆశలకు రెక్కలొచ్చేశాయనే చెప్పాలి.

 

రీసెంట్‌గా ‘ఇండియన్‌ 2’ సెట్‌లో జరిగిన ఘోర యాక్సిడెంట్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ఇప్పట్లో స్టార్ట్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఏకంగా కమల్‌ హాసన్‌ ఈ ప్రాజెక్ట్‌కి గుడ్‌ బై చెప్పేయనున్నాడన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. నిర్మాతలకూ, కమల్‌కీ మధ్య రేగిన చిచ్చు కార్చిచ్చులా దహించేస్తుండడంతో విస్తుపోయిన కమల్‌, ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవాలనుకుంటున్నాడట. అలా గానీ జరిగితే, కాజల్‌ కలలు కల్లలే మరి. ఇటు తెలుగులోనూ చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్‌ లేక, తమిళంలోనూ పరిస్థితి అలా ఉంటే, కాజల్‌ని గట్టెక్కించేదెవరు.? మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతోన్న ‘మోసగాళ్లు’ ప్రాజెక్ట్‌ మాత్రమే కాజల్‌ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్‌. అలాగే ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోందనుకోండి. ఎంతైనా ‘ఇండియన్‌ 2’లో నటించడమనే అచీవ్‌మెంట్‌ వేరు కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS