కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కుడి భుజానికి ఆపరేషన్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. కేర్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు రఘువీరా రెడ్డి ఆద్వర్యంలో ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈరోజే బాలయ్య డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఆయనకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు.
గత కొంతకాలంగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధ పడుతున్నారు. వైద్యుల్ని సంప్రదిస్తే... ఆపరేషన్ అవసరం అని తేల్చారు. కానీ అఖండ షూటింగ్ కి అడ్డు రాకూడదన్న ఉద్దేశ్యంతో బాలయ్య ఇంత వరకూ ఆగారు. ఇటీవలే అఖండ షూటింగ్ పూర్తయ్యింది. అందుకే ఇప్పుడు ఆపరేషన్ తతంగం పూర్తి చేశారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని కథకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. విశ్రాంతి తదనంతరం బాలయ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.