ఈసారి సంక్రాంతి జాతర మామూలుగా ఉండేట్టు లేదు. భారీ సినిమాలు బాక్సాఫీసు దగ్గర క్యూ కడుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్, బంగార్రాజు, సర్కారు వారి పాట ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా చేరింది. అదే.. `శేఖర్`. రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా ఇది. లలిత్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. నిజానికి డిసెంబరులో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది.
సంక్రాంతికి భారీ సినిమాలు ఉ్ననా సరే... వాటితో పోటీగా తన సినిమాని దింపుతున్నాడు రాజశేఖర్. రాజ శేఖర్ నటించిన 91 వ సినిమా ఇది. ఇందులో రాజశేఖర్ గెటప్ కొత్తగా కనిపించబోతోంది. గరుడ వేగతో రాజశేఖర్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరవాత విడుదలైన కల్కి కి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకే ఈ సినిమాపైనా భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఎంఎల్వీ సత్య నారాయణ, శివాని శివాత్మిక, వెంకట శ్రీనివాస బొగ్గరం లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.