బోయ‌పాటి సినిమా ఆగిందా?

By Gowthami - April 25, 2019 - 19:30 PM IST

మరిన్ని వార్తలు

బాల‌కృష్ణ - బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్‌ల త‌ర‌వాత వీరి కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా ఇది. మే - జూన్‌ల‌లో చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వ్వాల్సివుంది. అయితే... ఈ కాంబో అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగింది. ఆ స్థానంలో కె.ఎస్‌.ర‌వికుమార్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు జై సింహా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌. 

 

ఇప్పుడు ఇదే కాంబినేష‌న్‌లో ఓ సినిమా మొద‌లుకానుంది. మేలో లాంఛ‌నంగా ప్రారంభించి, జూన్‌లో సెట్స్‌పైకి వెళ్తారు. ఈ సినిమా పూర్త‌య్యాకే బాల‌కృష్ణ -బోయ‌పాటి కాంబోలో సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు నుంచి బోయ‌పాటి సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఈలోగా... కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమా పూర్తి చేయాలి. ఇప్ప‌టికే కె.ఎస్ ర‌వికుమార్ స్క్రిప్టు సిద్దం చేయ‌డంతో.. అతి త్వ‌ర‌లో ఈ కాంబో ప‌ట్టాలెక్క‌డానికి రెడీ అయిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS